breaking news
sarbananda
-
సాధ్యమైనంత తొందరగా సీలింగ్: సోనోవాల్
గుహవతి: అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఇండో- బంగ్లా బార్డర్ కు యుద్ధ ప్రాతిపదికన సీలింగ్ వేయాలని బార్డర్ సెక్యూరిటీ పోర్స్(బీఎస్ఎఫ్) కు సూచించారు. బీఎస్ఎఫ్ అత్యన్నత స్థాయి అధికారులతో సమావేశమైన సోనోవాల్ అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు త్వరితగతిన కంచె నిర్మించాలని వారికి సూచించారు. ఇందుకోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకో్వాలని పేర్కొన్నారు. లేజర్ వాల్ నిర్మాణం గురించి ఆలోచించాలని, నదీజలాలు, బార్డర్ వెంబడి భద్రతకు సీలింగ్ చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. బార్డర్ వెంబడి సీలింగ్ అనేది ఎన్నికల్లో తాము హామీ ఇచ్చామని కూడా సోనోవాల్ పేర్కొన్నారు. అస్సాం బంగ్లాదేశ్ తో 42 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది. -
కేంద్ర మంత్రి రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. మరో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ కు అదనంగా క్రీడా, యువజన శాఖను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు సర్బానంద అస్సాం బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో సాధించడంలో సర్బానంద క్రియాశీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.