టాస్క్‌ఫోర్స్‌ అధ్యయనం చేస్తోంది | Sakshi
Sakshi News home page

టాస్క్‌ఫోర్స్‌ అధ్యయనం చేస్తోంది

Published Fri, Jun 15 2018 1:23 AM

Central Govt once again announced about formation of steel plants - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని ఖమ్మం జిల్లా, ఏపీలోని వైఎస్సార్‌ జిల్లాల్లో స్టీల్‌ ప్లాంట్ల ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌ అధ్యయనం కొనసాగుతోందని కేంద్ర ఉక్కు శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 2016లో ఏర్పాటైన ఈ టాస్క్‌ఫోర్స్‌ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉక్కు శాఖ పరిధిలోని కేంద్ర పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థ మెకాన్‌ ఉన్నాయని వివరించింది. ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలత, రోడ్‌మ్యాప్‌ తయారీ చేపట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తోందని పేర్కొంది. ప్లాంటు ఏర్పాటు సాధ్యత నివేదికలను రాష్ట్ర ప్రభుత్వాలు మెకాన్‌కు అందజేయాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపింది.

వాణిజ్యపరంగా ఈ ప్లాంట్లు యోగ్యత కలిగి ఉండేందుకు వీలుగా తాము పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామంది. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలులో ప్లాంట్ల ఏర్పాటుకు చట్టం చేసిన 6 నెలల్లోపు స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఫీజిబులిటీ నివేదిక అందజేయాల్సి ఉందని, ఆ నివేదిక ప్రకారం ఆర్థికంగా ఆయా ప్లాంట్లకు యోగ్యత లేదని కేంద్రం ఈ ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాతే టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. 

Advertisement
Advertisement