సిండికేట్ బ్యాంకులో భారీ కుంభకోణం | CBI probes Rs 1000 crore alleged fraud in Syndicate Bank | Sakshi
Sakshi News home page

సిండికేట్ బ్యాంకులో భారీ కుంభకోణం

Mar 8 2016 2:17 PM | Updated on Sep 3 2017 7:16 PM

సిండికేట్ బ్యాంకులో భారీ కుంభకోణం

సిండికేట్ బ్యాంకులో భారీ కుంభకోణం

సిండికేట్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగు చూసింది.

న్యూఢిల్లీ: సిండికేట్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఫోర్జరీ, తప్పుడు బిల్లుల ద్వారా వెయ్యి కోట్ల రూపాయల నిధులను కాజేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారుల పాత్రపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

మంగళవారం సీబీఐ అధికారులు ఢిల్లీ, జైపూర్, ఉదయ్ పూర్ లలో దాడులు చేశారు. సిండికేట్ బ్యాంకు  కార్యాలయాలు, అధికారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మొత్తం పది ప్రాంతంలో తనిఖీలు చేసినట్టు సీబీఐ ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement