చంద్రబాబు డైరెక్షన్‌లోనే హైదరాబాద్‌ ఈడీ.. జూపూడి | The Hyderabad ED is operating under Chandrababu direction: Jupudi Prabhakar | Sakshi
Sakshi News home page

చంద్రబాబు డైరెక్షన్‌లోనే హైదరాబాద్‌ ఈడీ.. జూపూడి

Oct 13 2026 2:35 PM | Updated on Oct 13 2026 2:45 PM

The Hyderabad ED is operating under Chandrababu direction: Jupudi Prabhakar

సాక్షి, తాడిపత్రి: కాంగ్రెస్‌, టీడీపీ కుట్రల్లో భాగంగానే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై సీబీఐ కేసులు నమోదు చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌ రావు అన్నారు. తాడేపల్లిలో ఈ రోజు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సీబీఐ, ఈడీ సంస్థల కాళ్లుపట్టుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు.

ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ఈడీ చంద్రబాబు జేబు సంస్థగా మారింది. కేసులను త్వరగా తేల్చాలని వైఎస్‌ జగన్‌ అనేకసార్లు కోర్టులను కోరారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు వెళుతున్నారని చంద్రబాబుకు భయం పట్టుకుంది. 2024 ఎన్నికల్లో గెలిచింది వైఎస్సార్సీపీనే రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు.  అని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక చంద్రబాబు నిత్యం జగన్ జపం చేస్తున్నారు. 14 ఏళ్లుగా కేసుల విషయమై కోర్టులను గౌరవిస్తూ జగన్ విచారణకు సహకరిస్తూనే ఉన్నారు. ఇప్పటికే హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతుంటే ఈడీకి కొత్తగా ఈ అత్యుత్సాహం ఎందుకని ప్రశ్నించారు. ?సీబీఐ కేసు తేలకముందే ఈడీ కేసును వేగవంతం చేయాలనే తొందర ఎందుకు?ఈడీ తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాలిచంద్రబాబు జేబు సంస్థగా మారకూడదన్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రజల మనిషని చంద్రబాబు ప్రయోజనాల కోసమే హైదరాబాద్‌ ఈడీ పనిచేస్తోందని సీబీఐ కోర్టు అంతిమ తీర్పు ఇవ్వకుండా ఈడీ ఎలా తీర్పు ఇస్తోందని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే హైదరాబాద్‌ ఈడీ నడుస్తోందని జూపుడి ప్రభాకర్‌ రావు అన్నారు.

ఇదీ చదవండి: ఎన్‌ఈసీకి ఆధారాలిచ్చాం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement