షారుఖ్‌పై ముంబై కోర్టులో ఫిర్యాదు | Case filed against Shah Rukh Khan for gender test of surrogate child | Sakshi
Sakshi News home page

షారుఖ్‌పై ముంబై కోర్టులో ఫిర్యాదు

Aug 10 2013 1:06 AM | Updated on Jul 23 2018 9:15 PM

షారుఖ్‌పై ముంబై కోర్టులో ఫిర్యాదు - Sakshi

షారుఖ్‌పై ముంబై కోర్టులో ఫిర్యాదు

సరోగసీ (అద్దె గర్భం) ద్వారా ఇటీవల బిడ్డను పొందే క్రమంలో బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ దంపతులు గర్భస్త శిశువుకు లింగనిర్ధారణ పరీక్షలు జరిపించారని... అందువల్ల వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముంబైలోని కోర్టులో ఫిర్యాదు నమోదైంది.

ముంబై: సరోగసీ (అద్దె గర్భం) ద్వారా ఇటీవల బిడ్డను పొందే క్రమంలో బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ దంపతులు గర్భస్త శిశువుకు లింగనిర్ధారణ పరీక్షలు జరిపించారని... అందువల్ల వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముంబైలోని కోర్టులో ఫిర్యాదు నమోదైంది. లింగ నిర్ధారణ ఎంపిక నిషేధ చట్టం నిబంధనలను షారుఖ్ దంపతులు ఉల్లంఘించారని వర్షా దేశ్‌పాండే అనే న్యాయవాది కోర్టులో గురువారం ఈ ఫిర్యాదు చేశారు. తన ఆరోపణలపై బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించినట్లు దేశ్‌పాండే పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపడతామని సెప్టెంబర్ 12న చేపడతామని కోర్టు తెలిపింది. దీనిపై స్పందన తెలపాలంటూ షారుఖ్ దంపతులతోపాటు మున్సిపల్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement