సరోగసీ ప్రెగ్నెన్సీ ప్రకటించిన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్ | Actor Sambhavna Seth announces pregnancy with surrogacy | Sakshi
Sakshi News home page

Sambhavna Seth: సరోగసీ ప్రెగ్నెన్సీ ప్రకటించిన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్

Apr 30 2026 3:28 PM | Updated on Apr 30 2026 4:15 PM

Actor Sambhavna Seth announces pregnancy with surrogacy

బాలీవుడ్ బ్యూటీ, నటి సంభావన సేథ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను సరోగసీ (అద్దె గర్భం) ద్వారా మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.  సరోగసీ ద్వారా తమ బిడ్డను ఆహ్వానించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని సంభావన సేథ్, ఆమె భర్త అవినాష్ ద్వివేది తెలిపారు.

కాగా.. ఈ జంట చాలాసార్లు ఐవీఎఫ్‌ ప్రయత్నించారు. కానీ సక్సెస్ కాకపోవడంతో సరోగసీ ద్వారా తమ మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తాజాగా ప్రకటించారు.  ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా.. 2024లో సంభావనకు మొదటి త్రైమాసికంలోనే ఓసారి గర్భస్రావం జరిగింది. ఆ టైమ్‌లో తాను శారీరక, మానసిక ఒత్తిడికి గురైనట్లు వెల్లడించింది. అప్పుడు మూడు నెలల వ్యవధిలో తాను 65 ఇంజెక్షన్లు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అది చాలా బాధాకరంగా అనిపించిందన్నారు. సినీ కెరీర్ పరంగా చూస్తే సంభావన సేత్  2025లో వచ్చిన 'మండల మర్డర్స్'  చిత్రంలో చివరిసారిగా కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement