సైఫ్ అలీఖాన్‌పై అభియోగాలు నమోదు | case against saif ali khan | Sakshi
Sakshi News home page

సైఫ్ అలీఖాన్‌పై అభియోగాలు నమోదు

Mar 14 2014 3:11 AM | Updated on Sep 2 2017 4:40 AM

సైఫ్ అలీఖాన్‌పై అభియోగాలు నమోదు

సైఫ్ అలీఖాన్‌పై అభియోగాలు నమోదు

దక్షిణాఫ్రికా వ్యాపారవేత్తపై రెండేళ్ల క్రితం నాటి దాడి కేసులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ఆయన స్నేహితులు ఇద్దరిపై ముంబైలోని స్థానిక కోర్టులో గురువారం అభియోగాలు నమోదయ్యాయి.

ముంబై: దక్షిణాఫ్రికా వ్యాపారవేత్తపై రెండేళ్ల క్రితం నాటి దాడి కేసులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ఆయన స్నేహితులు ఇద్దరిపై ముంబైలోని స్థానిక కోర్టులో గురువారం అభియోగాలు నమోదయ్యాయి. నిందితులతోపాటు ఫిర్యాదుదారుకి నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణ మొదలవుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వజీద్ షేక్ మీడియాకు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 30న జరుగుతుందని చెప్పారు.
 
  2012 ఫిబ్రవరి 22న ముంబైలోని తాజ్ హోటల్లో దక్షిణాఫ్రికా వ్యాపారవేత్త ఇక్బాల్ మీర్‌శర్మ ఆయన మామయ్యపై సైఫ్ అలీఖాన్, ఆయన స్నేహితులు దాడి చేసి కొట్టారని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు సైఫ్, అతని స్నేహితులను అరెస్ట్ చేయగా, అనంతరం వారు బెయిల్‌పై విడుదలయ్యారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement