ఉత్తరప్రదేశ్ గవర్నర్ నివాసమైన యూపీ రాజ్భవన్లోకి బాంబులతో ఉన్న కారు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న డ్రైవర్ను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు.
ఉత్తరప్రదేశ్ గవర్నర్ నివాసమైన యూపీ రాజ్భవన్లోకి బాంబులతో ఉన్న కారు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న డ్రైవర్ను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఆ కారులో మూడు నాటుబాంబులు ఉన్నాయి. బంగ్లా గేటు వద్దే కారును పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం యూపీలోని మోహన్లాల్ గంజ్ ప్రాంతానికి చెందిన రంజీత్ శర్మ అనే వ్యక్తి మహాత్మాగాంధీ మార్గ్లోని రాజ్భవన్ గేటు నెంబర్ 2 గుండా భద్రతావలయాన్ని దాటుకుని కారుతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.
భద్రతా సిబ్బంది వెంటనే కారును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేయగా వెనకసీటు వద్ద మూడు బాంబులు బయటపడ్డాయి. వెంటనే డ్రైవర్ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే కారును శుక్రవారం నాడు ఓ పెళ్లి బృందం వాళ్లు అద్దెకు తీసుకున్నారని, మందుగుండు సామగ్రి వదిలేసి ఉంటారని డ్రైవర్ అంటున్నాడు.