ఢిల్లీలో కుప్పకూలిన భవనం | building falls in New Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కుప్పకూలిన భవనం

Apr 22 2015 10:06 AM | Updated on Sep 3 2017 12:41 AM

దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది.

ఒకరు మృతి
ఆరుగురికి గాయాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మోతీ నగర్లో మూడంతస్తుల భవనం బుధవారం ఉదయం 8.30 నుంచి 9.00 గంటల మధ్యలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అందులోంచి ఒక శవాన్ని బయటికి తీశారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది.

Advertisement
 
Advertisement
Advertisement