ఢిల్లీలో కుప్పకూలిన భవనం
                  
	ఒకరు మృతి
	ఆరుగురికి గాయాలు
	న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మోతీ నగర్లో మూడంతస్తుల భవనం బుధవారం ఉదయం 8.30 నుంచి 9.00 గంటల మధ్యలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అందులోంచి ఒక శవాన్ని బయటికి తీశారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది.