రెండు పాకిస్తానీ బోట్లు సీజ్‌ | BSF seizes two Pakistani boats | Sakshi
Sakshi News home page

రెండు పాకిస్తానీ బోట్లు సీజ్‌

Apr 3 2017 4:28 PM | Updated on Mar 23 2019 8:36 PM

ఫెరోజ్‌పూర్‌ జిల్లాలో రెండు పాకిస్తానీ బోట్లను సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) అధికారులు సోమవారం సీజ్‌ చేశారు.

చండీగడ్‌(పంజాబ్‌): ఫెరోజ్‌పూర్‌ జిల్లాలో రెండు పాకిస్తానీ బోట్లను సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గస్తీ కాస్తున్న సమయంలో పాకిస్తాన్‌కు చెందిన బోట్లు దొన్నా టెల్‌ మాల్‌ ఔట్‌పోస్టు వద్ద ఆగి ఉండటం గమనించారు. లొంగిపొమ్మని జవాన్లు హెచ్చరికలు పంపినా పెడచెవిన పెట్టిన నిందితులు నదిలోకి దూకి పాకిస్తాన్‌ వైపు ఈదుకుంటూ పోయారు. స్వాధీనం చేసుకున్న బోట్లలో సుమారు 45 కిలోల చేపలు ఉన్నాయి. పాకిస్తాన్‌కు పంజాబ్‌కు మధ్య 553 కిలో మీటర్ల సరిహద్దు ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement