ఆరేళ్ల పాపపై పైశాచికం | Brutally attacks on six year child | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల పాపపై పైశాచికం

Mar 8 2015 3:02 AM | Updated on Nov 6 2018 4:56 PM

ఆరేళ్ల పసిపాపపై ఓ దుర్మార్గుడు పైశాచికత్వం ప్రదర్శించాడు.

అహ్మదాబాద్: ఆరేళ్ల పసిపాపపై ఓ దుర్మార్గుడు పైశాచికత్వం ప్రదర్శించాడు. చిన్నారి మర్మావయవాల్లోకి ఇనుప రాడ్‌ను చొప్పించి రాక్షసుడిలా ప్రవర్తించాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సోలా ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన సెక్యూరిటీ గార్డ్ కౌశాల్ అనిల్‌సింగ్ చౌహాన్(24) ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇతడు గతంలో సోలా ప్రాంతంలోనే పనిచేశాడు. ఆ సమయంలో పాప తల్లిదండ్రులతో గొడవ లు జరిగాయి. ఈ కారణంగానే పాపను శారీరకంగా హింసించాడని పోలీసులు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

శనివారం చౌహాన్‌ను కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో మహిళా సురక్ష సమితి అనే ఎన్జీవోకు చెందిన 50 మంది సభ్యులు అతడిని చితకబాదారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ఉద్దేశం తమకు లేదని, అయితే ఈ కోర్టులు, పోలీసులు మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించలేకపోతున్నప్పుడు సహనం నశిస్తోందని ఎన్జీవో వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీ భట్ చెప్పారు. ఇప్పటిదాకా ఇలా 27 మంది కామాంధులకు దేహశుద్ధి చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement