బ్రహ్మపుత్రకు పోటెత్తిన వరద

Brahmaputra River Crosses Danger Mark Due To Assam Floods   - Sakshi

గువహటి : అసోంలో ఎడతెరిపిలేని వర్షాలతో వరద పోటెత్తింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో వరద పరిస్థితితో 62,000 మందికి పైగా ప్రజలు నిర్వాసితులయ్యారు. జోర్హాట్‌లోని నిమతి వద్ద బ్రహ్మపుత్ర నది ప్రమాదస్ధాయిని మించి పొంగిపొర్లుతోంది. దెమాజి, లఖింపూర్‌, బిశ్వనాధ్‌, జోర్హాట్‌, గోలాఘాట్‌ జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు.

వరద ఉధృతితో రంగనొది హైడ్రో విద్యుత​ ప్రాజెక్టు నుంచి వరద నీటిని విడుదల చేయడంతో లఖింపూర్‌ జిల్లా నీట మునిగింది. కుండపోతతో కొండచరియలు విరిగిపడి గువహటిలో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో వరద బీభత్సం మరింత పెరిగే అవకాశం ఉందని స్కైమెట్‌ అంచనా వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top