ప్రాణాలు హరించిన సెల్ఫీ! | Boy gets hit by rock while taking a selfie in bangalore | Sakshi
Sakshi News home page

ప్రాణాలు హరించిన సెల్ఫీ!

Dec 27 2016 1:11 PM | Updated on Sep 4 2017 11:44 PM

లాల్‌బాగ్‌ పార్కు(ఇన్‌సెట్లో) బాలుడు విక్రమ్‌

లాల్‌బాగ్‌ పార్కు(ఇన్‌సెట్లో) బాలుడు విక్రమ్‌

పార్కులో సరదాగా గడపడానికి వచ్చిన బాలుడు అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

బనశంకరి (బెంగళూరు): పార్కులో సరదాగా గడపడానికి వచ్చిన బాలుడు అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. శ్రీరామపురకు చెందిన కుమార్, రేవతి దంపతులు ఆరేళ్ల కుమారుడు విక్రమ్‌తో కలసి సోమవారం మధ్యాహ్నం 2.45 గంటలకు లాల్‌బాగ్‌ వీక్షణకు వెళ్లారు. ఐదడుగుల పొడవైన నిలువెత్తు రాయి మీద బాబును కూర్చోబెట్టి సెల్‌ఫోన్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా, రాయి కిందపడింది. దానిమీదున్న బాలుడు కూడా కిందపడ్డాడు. రాయి బలంగా తాకడంతో అక్కడికక్కడే అక్కడే దుర్మరణం చెందాడు.

కుమారుడు కళ్లముందే మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. లాల్‌బాగ్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని వారు ఆరోపించారు. సిద్ధాపుర పోలీసులు కేసు విచారణ చేపట్టారు. రాతి స్తంభంపై కూర్చుని సెల్ఫీ తీయడంతోనే ప్రమాదం చోటుకుందని ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.ఆర్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. బాలుడు విక్రమ్‌ రాతి పిల్లర్‌పై కూర్చుని సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో పిల్లర్‌ పడిపోయిందని చెప్పారు. కాగా, 2015 ఆగస్టులో వైష్ణవి అనే విద్యార్థిని ఇదే పార్కులో తేనేటీగలు దాడిచేయడంతో చనిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement