మహిళా ఉద్యోగికి వయాగ్రా మాత్ర ఇచ్చాడు | Boss offers employee Viagra for headache | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగికి వయాగ్రా మాత్ర ఇచ్చాడు

Jan 14 2016 5:18 PM | Updated on Sep 3 2017 3:41 PM

మహిళా ఉద్యోగికి వయాగ్రా మాత్ర ఇచ్చాడు

మహిళా ఉద్యోగికి వయాగ్రా మాత్ర ఇచ్చాడు

తలనొప్పికి వయాగ్రా మాత్ర ఇచ్చిన బాస్ పై ఓ మహిళా ఉద్యోగి(22) పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బెంగళూరు: తలనొప్పికి వయాగ్రా మాత్ర ఇచ్చిన బాస్ పై ఓ మహిళా ఉద్యోగి(22) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరు గాంచిన బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది. తనకు తలనొప్పిగా ఉందని, మాత్రలు కొనుక్కునేందుకు బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన మహిళా ఉద్యోగికి బాస్ వయాగ్రా మాత్ర ఇచ్చాడు. దీంతో అవాక్కయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.

జలహళ్లిలోని ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలో ఏడాది కాలం నుంచి ఇంచారా(పేరు మార్చాం) డేటా ప్రాసెసర్ గా పనిచేస్తోంది. మేనేజర్ మల్లప్ప(38) గత మూడు నాలుగు నెలల నుంచి ఆమెను వేధిస్తున్నాడు. ఆఫీసులో ఎవరూ లేనప్పుడు తన చున్నీ లాగడం, అసభ్యంగా తాకడం వంటి పనులు చేస్తున్నాడని పీన్యా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు వాపోయింది.

తన తండ్రి మరణించిన నాటి నుంచి పెళ్లి చేసుకుంటానని వెంట బడుతున్నాడని తెలిపింది. అతడి వేధింపుల గురించి చెప్పినా ఎవరూ నమ్మరని, తన ఉద్యోగం కూడా పోతుందన్న భయంతో ఇన్నాళ్లు కేసు పెట్టలేదని చెప్పింది. పైచదువులకు ఆర్థిక సహాయం చేస్తానని, మంచి ఉద్యోగం ఇప్పిస్తామని పలుమార్లు మలప్ప ఆఫర్ చేసినా తిరస్కరించానని బాధితురాలు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement