బెదిరింపు ఫోన్ తో ఆదివారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం కిందకు దిగింది.
పణజి: బెదిరింపు ఫోన్ తో ఆదివారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం కిందకు దిగింది. ఢిల్లీ నుంచి గోవా మీదుగా మాస్కోకు బయలు దేరిన విమానం ఏఐ-156కు బాంబు బెదిరింపు ఫోన్ కావడంతో కలకలం రేగింది. విదేశ్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి విమానంలో బాంబు ఉందని చెప్పాడు. వెంటనే అప్రమత్తన భద్రతా సిబ్బంది గోవాలో విమానాన్ని కిందకు దించేసి తనిఖీలు చేపట్టారు.
బాంబు లభ్యం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆకతాయిల పనిగా గుర్తించారు. విమానంలో నలుగురు విదేశీయులతో పాటు 89 మంది ప్రయాణికులు ఉన్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.