సరోగసీ తండ్రి.. కరణ్‌ | Bollywood showers blessings on Karan Johar's twins | Sakshi
Sakshi News home page

సరోగసీ తండ్రి.. కరణ్‌

Mar 6 2017 2:17 AM | Updated on Sep 5 2017 5:17 AM

సరోగసీ తండ్రి.. కరణ్‌

సరోగసీ తండ్రి.. కరణ్‌

ప్రముఖ బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ సరోగసీ ద్వారా కవలలకు తండ్రి (సింగిల్‌ ఫాదర్‌) అయ్యారు. ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటనలో 44 ఏళ్ల కరణ్‌ ప్రకటించారు.

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ సరోగసీ ద్వారా కవలలకు తండ్రి (సింగిల్‌ ఫాదర్‌)  అయ్యారు. ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటనలో 44 ఏళ్ల కరణ్‌ ప్రకటించారు. తన తల్లిదండ్రుల పేర్లు కలసివచ్చేట్లుగా కూతురుకు రూహి, కొడుకుకు యష్‌ పేర్లు పెట్టారు. కరణ్‌ తండ్రి కావడంపై బాలీ వుడ్‌ తారలు వివిధ సామాజిక మాధ్య మాల ద్వారా ఆనందం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం చాలా ఉద్వేగంగా ఉందని, తండ్రిగా నా బాధ్యతలను, విధులను సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రకటనలో కరణ్‌ పేర్కొన్నారు. మానసికంగా, భౌతికంగా, భావోద్వేగంతో కూడిన  ప్రేమను తన బిడ్డలకు పంచేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. పిల్లలే తన ప్రపంచమని, ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఇక నుంచి సినిమాలు, ప్రయాణాలు, ఒప్పందాలన్ని పిల్లల తర్వాతేనని  కరణ్‌ జోహార్‌ వెల్లడించారు. సరోగసీలో శిశువులకు జన్మనిచ్చిన మహిళకు కరణ్‌ కృత జ్ఞతలు తెలిపారు. తన జీవితకాల కలను ఆమె నెరవేర్చారన్నారు. దేవుడి దయ వల్ల గొప్ప తల్లిని పొందానని, ఇప్పుడామె మనవడు, మనవరాలి ఆలనాపాలనలో ముఖ్యపాత్ర పోషిస్తుం దన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement