ఈగేమ్‌ ప్రాణాలు తీస్తోంది..! | Blue Whale’ challenge game said to committing suicides | Sakshi
Sakshi News home page

ఈగేమ్‌ ప్రాణాలు తీస్తోంది..!

May 7 2017 9:29 AM | Updated on Nov 6 2018 8:28 PM

ఈగేమ్‌ ప్రాణాలు తీస్తోంది..! - Sakshi

ఈగేమ్‌ ప్రాణాలు తీస్తోంది..!

ఓ ఆండ్రాయిడ్‌ గేమ్‌ ప్రాణాలు తీసుకొనేల యువతను పేరేపిస్తుంది.

న్యూఢిల్లీ: ఓ ఆండ్రాయిడ్‌ గేమ్‌ ప్రాణాలు తీసుకొనేల యువతను పేరేపిస్తుంది. చిన్న చిన్న పనుల నుంచి మొదలు పెట్టి చివరకు మనతో ఆత్మహత్య చేసుకొనేలా చేస్తుంది. దాని పేరే 'బ్లూ వేల్‌ ఛాలెంజ్‌'.  ఈ గేమ్‌ ఆడిన వారిలో సుమారు ఎక్కువ శాతం మంది ఆత్మహత్య చేసుకున్నారు.

అన్ని ఆండ్రాయిడ్‌ గేమ్స్‌ లాగే ఇదీ ఓగేమ్‌. దీనిలో మొదట రిజిస్టర్‌ అవగానే 50 రోజల పాటు ప్రతిరోజు ఏదో ఒక టాస్క్‌ చేయాల్సి ఉంటుంది. చేసిన ప్రతి పనికి ప్రూఫ్‌ చూపించాలి. మొదట్లో చిన్న చిన్న పనుల దగ్గర నుంచి మొదలై పోను పోను నరకాన్ని చూపిస్తాయి. ఉదయం నాలుగు గం‍టలకే భయానక వీడియోలు చూడమని, డాబా మీదకు వెళ్లమని, చేతిమీద కోసుకోమని ఇలా అనేక విధాలుగా చేయాల్సిన టాస్కుల లిస్టు చెబుతుంది. ఏదో ఒక రోజు మీరు చనిపోవాలనుకుంటున్న తేదీ చెప్పమంటుంది.

50వరోజు వచ్చేసరికి చనిపోమని ఆదేశిస్తుంది. దీంతో మానసికంగా ఆయా టాస్కులకు అలవాటు పడిన వారు చివరికి ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పటికే ఈ గేమ్‌ వల్ల రష్యాలో పలువురు టీనేజ్‌ యువత బలవన్మరణాలకు పాల్పడ్డారు. మనం ఇంట్లో పిల్లలకు మొబైల్‌ ఇచ్చే ముందు ఇలాంటివి లేకుండా చూడాలి. తరచుగా వారి ఫోన్‌లు తనిఖీ చేస్తుండాలి. లేకపోతే వారిని కోల్పోవాల్పి వస్తుంది. ఇందులో వచ్చే కొన్ని టాస్కులు చూడండి. కానీ మీరు మాత్రం ట్రై చేయకండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement