భారతీయ జనతా పార్టీ శనివారం వెలవడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో భారీ విజయం సాధించడంతో పార్టీ పార్లమెంటరి బోర్డు ఆదివారం సాయంత్రం భేటీ కానుంది.
యూపీ, ఉత్తరాఖండ్ సీఎంలు ఎవరు?
Mar 12 2017 12:10 PM | Updated on Aug 15 2018 6:34 PM
ఆదివారం సాయంత్రం పార్లమెంటరి బోర్డు మీటింగ్ నిర్ణయించునన్న బీజేపీ పార్టీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ శనివారం వెలవడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో భారీ విజయం సాధించడంతో పార్టీ పార్లమెంటరి బోర్డు ఆదివారం సాయంత్రం భేటీ కానుంది.
రెండు రాష్ట్రాలలో సీఎంలుగా ఎవరిని నియమించాలనే విషయంపై భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. గోవా, మణిపూర్‌లో పార్టీ స్థితిగతులపై మాట్లాడనున్నారు. రెండు రాష్ట్రాలలో పూర్తి మెజారీటీ దక్కకపోవడంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా భవిష్యత్ ప్రణాళికలు వెయ్యనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ భేటీకి హాజరుకానున్నారు. ఎన్నికలు జరిగిన సంబంధిత రాష్ట్రాలకు చెందిన ప్రముఖమైన నాయకులు మాత్రమే భేటీలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement