ఆ స్కాంలో బీజేపీ ఎంపీ కుమార్తె అరెస్ట్‌

BJP MP RP Sharmas Daughter Pallavi Arrested For Cheating In APSC Exam - Sakshi

గువహటి : 2016లో జరిగిన అస్సాం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీఎస్‌సీ) పరీక్షలో సమాధాన పత్రాలతో వారి చేతిరాత సరిపోలకపోవడంతో బీజేపీ ఎంపీ ఆర్‌పీ శర్మ కుమార్తె పల్లవి సహా 19 మంది అస్సాం అధికారులను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఏపీఎస్‌సీలో ఉద్యోగాల కొనుగోలు కుంభకోణాన్ని విచారిస్తున్న దిబ్రూగర్‌ పోలీసులు అస్సాం సివిల్‌ సర్వీస్‌, అస్సాం పోలీస్‌ సర్వీస్‌, ఇతర ప్రభుత్వ అధికారులు 19 మందికి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరి ఆన్సర్‌ షీట్లు, వీరి చేతిరాత ఒకేరకంగా లేదని గుర్తించారు. ఫోరెన్సిక్‌ పరీక్షల్లో వెల్లడైన ఫలితాల ఆధారంగా వీరిని గువహటిలో అరెస్ట్‌ చేశామని దిబ్రూగర్‌ ఎస్పీ గౌతం బోరా తెలిపారు. ఏపీఎస్‌సీ పరీక్షల అనంతరం రాకేష్‌ పాల్‌ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఈ 19 మంది అధికారులు ప్రభుత్వ సర్వీసుల్లోకి ఎంపికయ్యారు.

ఈ కుంభకోణంలో పాల్‌ సహా మరో ముగ్గురు అధికారులను గతంలో అరెస్ట్‌ చేశారు. కాగా, ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించి అరెస్ట్‌ అయిన 13 మంది అధికారులను అస్సాం ప్రభుత్వం జూన్‌ 21న ఉద్యోగాల నుంచి తొలగించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top