breaking news
apsc
-
ఆ స్కాంలో బీజేపీ ఎంపీ కుమార్తె అరెస్ట్
గువహటి : 2016లో జరిగిన అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీఎస్సీ) పరీక్షలో సమాధాన పత్రాలతో వారి చేతిరాత సరిపోలకపోవడంతో బీజేపీ ఎంపీ ఆర్పీ శర్మ కుమార్తె పల్లవి సహా 19 మంది అస్సాం అధికారులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీఎస్సీలో ఉద్యోగాల కొనుగోలు కుంభకోణాన్ని విచారిస్తున్న దిబ్రూగర్ పోలీసులు అస్సాం సివిల్ సర్వీస్, అస్సాం పోలీస్ సర్వీస్, ఇతర ప్రభుత్వ అధికారులు 19 మందికి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరి ఆన్సర్ షీట్లు, వీరి చేతిరాత ఒకేరకంగా లేదని గుర్తించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాల ఆధారంగా వీరిని గువహటిలో అరెస్ట్ చేశామని దిబ్రూగర్ ఎస్పీ గౌతం బోరా తెలిపారు. ఏపీఎస్సీ పరీక్షల అనంతరం రాకేష్ పాల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఈ 19 మంది అధికారులు ప్రభుత్వ సర్వీసుల్లోకి ఎంపికయ్యారు. ఈ కుంభకోణంలో పాల్ సహా మరో ముగ్గురు అధికారులను గతంలో అరెస్ట్ చేశారు. కాగా, ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయిన 13 మంది అధికారులను అస్సాం ప్రభుత్వం జూన్ 21న ఉద్యోగాల నుంచి తొలగించింది. -
ఏపీఎస్సీ చైర్మన్ అరెస్ట్
గువాహటి: ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీఎస్సీ) చైర్మన్ రాకేశ్ కుమార్ పాల్ ను శుక్రవారం సీబీఐ అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ అక్రమార్కుల పనిపడతానని గతంలోనే ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సోనోవాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీఎస్సీ చైర్మన్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. గడిచిన కొన్నేళ్లుగా ఏపీఎస్సీ చైర్మన్‌గా కొనసాగుతోన్న రాకేశ్ కుమార్.. కమిషన్ ద్వారా చేపట్టిన నియామకాల్లో తీవ్ర అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఈ నాటివికావు. రెండేళ్ల కిందటే ఆయనపై సీబీఐ దర్యాప్తునకు అసోం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే మధ్యలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. -
పోలీసులకు క్రమశిక్షణ, బాధ్యత అవసరం
డెంకాడ, న్యూస్‌లైన్ : పోలీసులు క్రమశిక్షణ, బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలాంటప్పుడే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డి.శివధర్‌రెడ్డి సూచిం చారు. చింతలవలస అయిదవ ఏపీఎస్పీ బెటాలియన్‌లో తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 432 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ గురువారం ఘనంగా జరిగింది. శిక్షణ పొందిన కానిస్టేబుళ్ళు కార్యక్రమానికి ముఖ్య అతి థిగా విచ్చేసిన కమిషనర్ శివధర్‌రెడ్డికి, బెటాలియన్ కమాండెంట్ జె.మురళీధర్‌కు గౌరవ వందనం చేశారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాన్ని పెరేడ్ ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్భంగా శివధర్‌రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలోనూ, అసాంఘిక శక్తుల అణచివేత లో బెటాలియన్ పోలీసుల పాత్ర చెప్పుకోదగ్గదన్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సమాజ రక్షణే ధ్యేయంగా పనిచేసిన సందర్భాలు ఏపీఎస్పీ బెటాలి యన్ చరిత్రలో అనేకమున్నాయన్నారు. ఏపీఎస్పీ బెటాలియన్‌లో 432 మంది పోలీసులు శిక్షణ దశలోనే పంచాయతీ ఎన్నికలు, గణేశ్ నిమజ్జనం వంటి సమయాల్లో విధులు నిర్వహించడం ద్వారా వారికి కొంత అనుభవం వచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఇకనుంచి కూడా పనిచేయాలని ఆకాంక్షించారు. బెటాలియన్ కమాండెంట్ మురళీధర్ మాట్లాడుతూ చింతలవలస అయిదవ ఏపీఎస్పీ బెటాలియన్‌లో శిక్షణ పొందేందుకు గుంటూ రు ఆరవ బెటాలియన్, నెల్లూరు జిల్లా వెంకటగిరి 9వ బెటాలియన్ నుంచి 453 మందిని కేటాయించారన్నారు. వారిలో 452 మంది శిక్షణకు హాజరు కాగా శిక్షణ సమయంలో 19 మంది వివిధ కారణాల తో శిక్షణ నుంచి వైదొలగగా 432 మంది శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. శిక్షణలో బెస్ట్ ఇండోర్, అవుట్ డోర్, ఫైరింగ్, బెస్ట్ అల్రౌండర్ ప్రతిభ కనబరిచిన పోలీసులకు మెమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎస్.నాగరాజు, అసిస్టెంట్ కమాండెంట్ ఎం.కృష్ణమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ కె.రాజేంద్రరావు, అసిస్టెంట్ కమాండెంట్ జి.ప్రభాకరరావు, ట్రైనీ అదికారులు నారాయణరావు,గోవిందరావు, ఎం.నారాయణ, జి.నారాయణ తదితరులు పాల్గొన్నారు. శిక్షణలో ఎన్నో నేర్చుకున్నాం.. తొమ్మిది నెలల పాటు జరిగిన శిక్షణలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వృత్తిలో ఎలాంటి నైపుణ్యం ఉండాలో అలా తమను తీర్చి దిద్దారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత సేవలు అందించేందుకు ఇదో మంచి మార్గం - బి.సురేంద్రబాబు, ట్రైనీ కానిస్టేబుల్ చిత్తశుద్ధితో సేవలు అందిస్తా.. పోలీసు విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తా ను. సమాజంలో పోలీసుల పాత్ర చాలా కీలకం. మాకు ఎంతో అనుభవం ఉన్న అధికారుల సూచనలు, సలహాలు విధి నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడతాయి. - ఆనందరావు, ట్రైనీ కానిస్టేబుల్