ఏపీఎస్సీ చైర్మన్ అరెస్ట్ | APSC chairman Rakesh kumar poul arrested | Sakshi
Sakshi News home page

ఏపీఎస్సీ చైర్మన్ అరెస్ట్

Nov 4 2016 8:06 PM | Updated on Aug 20 2018 4:27 PM

ఏపీఎస్సీ చైర్మన్ అరెస్ట్ - Sakshi

ఏపీఎస్సీ చైర్మన్ అరెస్ట్

ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఏపీఎస్సీ చైర్మన్ ను శుక్రవారం సీబీఐ అరెస్ట్ చేసింది.

గువాహటి: ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీఎస్సీ) చైర్మన్ రాకేశ్ కుమార్ పాల్ ను శుక్రవారం సీబీఐ అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ అక్రమార్కుల పనిపడతానని గతంలోనే ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సోనోవాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీఎస్సీ చైర్మన్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.

గడిచిన కొన్నేళ్లుగా ఏపీఎస్సీ చైర్మన్‌గా కొనసాగుతోన్న రాకేశ్ కుమార్.. కమిషన్ ద్వారా చేపట్టిన నియామకాల్లో తీవ్ర అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఈ నాటివికావు. రెండేళ్ల కిందటే ఆయనపై సీబీఐ దర్యాప్తునకు అసోం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే మధ్యలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement