మీ కోసం అమ్మాయిని కిడ్నాప్‌ చేసుకొస్తా

BJP MLA Promises to Kidnap Girls for Men if They Reject Proposals - Sakshi

ముంబై: ‘మీకు నచ్చిన అమ్మాయి ఎవరో చెప్పండి. ఆమెను కిడ్నాప్‌ చేసి తీసుకువచ్చే పూచీ నాది’..ఈ మాటలు అన్నది ఏ రౌడీనో కాదు. స్వయంగా మహారాష్ట్రలోని అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే. ముంబైలోని ఘాట్కోపర్‌ నియోజకవర్గంలో శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా సోమవారం నిర్వహించిన సంప్రదాయ ‘దహీహండీ’ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామ్‌ కదమ్‌ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన యువకులతో మాట్లాడారు. ‘మీకు ఎలాంటి అవసరమున్నా సరే నన్ను కలవండి. 100 శాతం పక్కాగా సాయం చేస్తా. నా దగ్గరికి వచ్చేటప్పుడు మీ తల్లిదండ్రులను వెంటబెట్టుకురండి. మీరు మనసు పడిన అమ్మాయిని కిడ్నాప్‌ చేసి, పెళ్లి చేసుకునేందుకు మీకు అప్పగిస్తా’ అని ప్రకటించారు. అంతటితో ఆగకుండా తన ఫోన్‌ నంబర్‌ కూడా వారికి చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top