'టాపర్స్ స్కాంతో కేంద్ర మంత్రికి లింకు' | BJP minister has close ties withBihar merit list scam accused: RJD | Sakshi
Sakshi News home page

'టాపర్స్ స్కాంతో కేంద్ర మంత్రికి లింకు'

Jun 12 2016 6:53 PM | Updated on Jul 18 2019 2:02 PM

'టాపర్స్ స్కాంతో కేంద్ర మంత్రికి లింకు' - Sakshi

'టాపర్స్ స్కాంతో కేంద్ర మంత్రికి లింకు'

బిహార్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాప్ ర్యాంకు స్కాంతో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు సంబంధం ఉందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ఆరోపించారు.

పట్నా: బిహార్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాప్ ర్యాంకు స్కాంతో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు సంబంధం ఉందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ఆరోపించారు. ప్రధాన నిందితుడు బచ్చారాయ్.. ఆయనకు సన్నిహితుడని వెల్లడించారు. వైశాలి జిల్లాలో బిషన్ రాయ్ కాలేజీ సెక్రటరీ, ప్రిన్సిపాల్ గా ఉన్న బచ్చారాయ్ శనివారం భగ్వాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఆర్ట్స్, సైన్స్ గ్రూపు పరీక్షల్లో ఈ కాలేజీకి చెందిన రుబీరాయ్, సౌరబ్ శ్రేష్ట్ లు టాప్ ర్యాంకులు సాధించడం తెలిసిందే.

అయితే టాపర్స్ స్కాంలో ప్రధాన నిందితుడు బచ్చారాయ్ తో గిరిరాజ్ సింగ్ కు సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ వీరిద్దరూ కలిసివున్న ఫొటోను తేజశ్వి యాదవ్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. నరేంద్ర మోదీకి ఎంతో ఇష్టమైన మంత్రితో రాయ్ అంటూ కామెంట్ పెట్టారు. రాయ్ తో గిరిరాజ్ కు వ్యాపార సంబంధాలున్నాయని కూడా ఆరోపించారు. రాయ్ తో మెడికల్ కాలేజీ పెట్టేందుకు సహాయం చేస్తానని గిరిరాజ్ హామీయిచ్చారని ఆర్జేడీ రోపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement