అసోంలో వికసించిన కమలం | bjp leading assam | Sakshi
Sakshi News home page

అసోంలో వికసించిన కమలం

May 19 2016 9:50 AM | Updated on Mar 29 2019 9:31 PM

అసోంలో వికసించిన కమలం - Sakshi

అసోంలో వికసించిన కమలం

అసోంలో బీజేపీ తొలిసారి అధికారం చేపట్టనుంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పినట్టే బీజేపీ ఘనవిజయం దిశగా దూసుకెళ్తోంది.

గువహటి: అసోంలో బీజేపీ తొలిసారి అధికారం చేపట్టనుంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పినట్టే బీజేపీ ఘనవిజయం దిశగా దూసుకెళ్తోంది. 126 సీట్లున్న అసోంలో బీజేపీ 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార కాంగ్రెస్ వెనుకబడిండి. కాంగ్రెస్ కేవలం 21 చోట్ల ముందంజలో ఉంది. ఏఐయూడీఎఫ్ 15, ఇతరులు 6 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న తరుణ్ గొగోయ్ (కాంగ్రెస్)పై తీవ్రమైన వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది. 15 ఏళ్ల తరుణ్ గొగోయ్ పాలనకు ముగింపుపడనుంది. అభివృద్ధి మంత్రతో ప్రచారం చేసిన బీజేపీ.. అసోం గణపరిషత్, బోడో పార్టీలతో కలిసి బరిలోకి దిగింది.
 

Advertisement
 
Advertisement
Advertisement