బిహార్‌లో పాక్షిక మద్యపాన నిషేధం విధిస్తూ బుధవారం అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు.
పట్నా: బిహార్‌లో పాక్షిక మద్యపాన నిషేధం విధిస్తూ బుధవారం అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. మద్యం అక్రమ ఉత్పత్తి, వ్యాపారం చేసిన వారికి జీవితఖైదు విధించేలా బిల్లులో మార్పులు చేశారు. ‘ఒకరికి ధర్మోపదేశం చేసేముందు మనం పాటించాలి. చట్టం చేసే మనం మొదటగా మద్యాన్ని త్యజించాలి’ అని చర్చలో సీఎం నితీశ్ కుమార్ అన్నారు.
మొదటి దశలో రాష్ట్రంలోని అన్ని పల్లెల్లో మద్యనిషేధం విధించారు. మునిసిపల్ కార్పొరేషన్లు, మండళ్లలో మాత్రం దేశంలో తయారైన విదేశీ మద్యం అమ్మకాలను మాత్రం అనుమతిస్తారు.