‘భీమ్’తో రూ.361 కోట్ల లావాదేవీలు

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భీమ్ యాప్ ద్వారా ఇప్పటి వరకు రూ.361 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు కేంద్రం బుధవారం లోక్‌సభలో వెల్లడించింది.
⇔ ఉద్యోగుల వేతనాలను చెక్కుల ద్వారా చెల్లించడం లేదా వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీచేయడానికి వీలు కల్పించే వేతనాల చెల్లింపు(సవరణ) బిల్లు–2017కు పార్లమెంట్‌లో ఆమోదం లభించింది.
⇔ వ్యాధులను నయంచేయడంలో పంచగవ్య (ఆవు మూత్రం, పేడ, పాలు, నెయ్యి, పెరుగుతో తయారయ్యే మిశ్రమం) పాత్రను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి స్టీరింగ్ కమిటీ ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
⇔ దిగుబడి నష్టం, తెగుళ్ల దాడులు, ధరల పతనంతో ఆదాయంలో తగ్గుదల నుంచి రైతులను ఆదుకునేందుకు తోట పంటలకు ఆదాయ బీమా పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి