‘వాజ్‌పేయికి భారతరత్న ఇవ్వాలి’ | Bharat Ratna should be given to Atal Bihari Vajpayee | Sakshi
Sakshi News home page

‘వాజ్‌పేయికి భారతరత్న ఇవ్వాలి’

Dec 25 2013 10:32 PM | Updated on Mar 29 2019 9:18 PM

‘వాజ్‌పేయికి భారతరత్న ఇవ్వాలి’ - Sakshi

‘వాజ్‌పేయికి భారతరత్న ఇవ్వాలి’

అటల్‌బిహారీ వాజ్‌పేయి 89వ పుట్టినరోజును జాతీయ ప్రగతి దినంగా ప్రకటించడంతోపాటు, ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి బీజేపీ విన్నవించింది.

అటల్‌బిహారీ వాజ్‌పేయి 89వ పుట్టినరోజును జాతీయ ప్రగతి దినంగా ప్రకటించడంతోపాటు, ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి బీజేపీ విన్నవించింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధులు హరీష్ ఖురానా, సతీష్ ఉపాధ్యాయ్‌లు ఈ మేరకు బుధవారం ఆయనకు ఓ లేఖ రాశారు. భారతీయులతోపాటు ప్రపంచంలోని అనేకమంది వాజ్‌పేయికి ఈ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని అభిలషిస్తున్నారన్నారు.

వాజ్‌పేయికి బాబు శుభాకాంక్షలు

మాజీ ప్రధాని, బీజేపీ అగ్ర నేత అటల్ బిహారీ వాజ్‌పేయికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం అటల్ పుట్టినరోజు కావడంతో చంద్రబాబు పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావును తన ప్రత్యేక దూతలుగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ పంపారు. వారిద్దరూ పుష్పగుచ్ఛంతో అటల్ నివాసానికి వెళ్లి ఆయనకు అందజేశారు. వాజ్‌పేయికి బాబు తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు అక్కడే ఉన్న బీజేపీ అగ్ర నేతలను మర్యాదపూర్వకంగా పలకరించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు వారితో మాట్లాడుతూ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేయమన్నారని టీడీపీపీ ఒక ప్రకటనలో పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement