బీసీసీఐ చీఫ్‌గా దాదా.. దీదీ స్పందన

BCCI Post: Mamata Calls Ganguly Part Of Her Household - Sakshi

కోల్‌కతా: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) ప్రెసిడెంట్‌గా ఎన్నిక కాబోతున్న మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశంసల జల్లు కురిపించారు. గంగూలీ మా ఇంటి కుటుంబసభ్యుడేనంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి  టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నేపథ్యంలో దాదా గురించి బెంగాల్‌ సీఎం దీదీ స్పందించారు. చిన్న వయస్సులో గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి అధిరోహిస్తుండటం ఆనందంగా ఉందని, ఇది బెంగాల్‌కు గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. కోల్‌కతాకు చెందిన జగ్‌మోహన్‌ దాల్మియా బీసీసీఐ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం సేవలు అందించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బెంగాల్‌ టైగర్‌గా భారత క్రికెట్‌కు సుదీర్ఘకాలం సేవలందించిన గంగూలీ తన కెరీర్‌లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడారు. ప్రస్తుతం ఆయన బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top