బంగ్లాదేశీ ‘చెదల’ను పంపిస్తాం

Bangladeshi Migrants Are 'Termites', Will Be Removed From Voters' List - Sakshi

జైపూర్‌: బంగ్లాదేశీ వలసదారులు చెదల వంటి వారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. వారందరినీ దేశం నుంచి వెళ్లగొడతామని ఆయన చెప్పారు. అస్సాంలో ఇటీవల ప్రచురించిన జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) గురించి షా మాట్లాడుతూ ‘బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌సీ ద్వారా అస్సాంలో 40 లక్షల మంది అక్రమ వలసదారులున్నట్లు ప్రాథమికంగా తేలింది. వారిలో ఏ ఒక్క చొరబాటుదారుడినీ వదిలిపెట్టం. అందరినీ పంపిస్తాం’ అని రాజస్తాన్‌లో చెప్పారు. చొరబాటుదారులను కాంగ్రెస్‌ ఓటుబ్యాంకుగా చూసిందనీ, వారందరినీ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు బీజేపీ కట్టుబడి ఉందని షా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గాలిలో మేడలు కడుతున్నారనీ, రాజస్తాన్‌లో బీజేపీ నుంచి అధికారం లాక్కోవడం ఎవ్వరికీ సాధ్యం కాదని షా విశ్వాసం వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top