ల్యాప్‌టాప్‌ చోరీ.. ఐటీ ఇంజనీరుకు సంకెళ్లు | Bangalore IT engineer held for stealing friends laptop | Sakshi
Sakshi News home page

ల్యాప్‌టాప్‌ చోరీ.. ఐటీ ఇంజనీరుకు సంకెళ్లు

Mar 21 2017 10:11 PM | Updated on Sep 5 2017 6:42 AM

అతడు ఐటీ ఇంజనీరు. అయినా ఎందుకో తప్పుదారి ఎంచుకున్నాడు.

బెంగళూరు: అతడు ఐటీ ఇంజనీరు. అయినా ఎందుకో తప్పుదారి ఎంచుకున్నాడు. తన స్నేహితుడి ల్యాప్ టాప్ ను చోరీ చేశాడు. ల్యాప్‌టాప్‌ చోరీ చేసిన ఆ యువకుడిని మంగళవారం బెంగళూరు మారతహళ్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన స్నేహితులు సతీశ్, వెంకటశేషారెడ్డిలు నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఇంజనీర్లుగా పని చేస్తున్నారు.

ఇటీవల సతీశ్‌... వెంకటశేషారెడ్డికి చెందిన ల్యాప్‌టాప్‌ను తస్కరించాడు. పైగా తనకేమీ తెలియదన్నట్టు వ్యవహరించాడు. ఈ విషయంపై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో సతీశే ల్యాప్‌టాప్‌ను చోరీ చేసినట్లు తేలింది. దాంతో మంగళవారం అతన్ని అరెస్ట్‌ చేసి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement