- సెలవు ప్రకటించిన ప్రభుత్వం
- ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా ఐదు రోజుల సెలవు
సాక్షి, చెన్నై : త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ఈనెల ఆరో తేదీ జరుపుకోనున్నారు. ఆ రోజును సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా ఐదు రోజు లు సెలవు దొరికినట్టు అయింది. భక్తి భావాన్ని చాటే రంజాన్ పండుగ అనంతరం ముస్లింలకు మరో ముఖ్య పండుగ బక్రీద్. త్యాగ నిరతిని చాటే ఈ పండుగను ఈదుల్ జుహా, ఈదుజ్జుహా అని కూడా పిలుస్తుంటారు. ఈ పండుగ వెనుక త్యాగాన్ని చాటే కథ ఉంది. దుల్హాజ్ మాసంలో పదో తేదీని బక్రీద్ పర్వదినంగా జరుపుకుంటారు.
ఈ ఏడాది బక్రీద్ పర్వదినం అక్టోబరు ఐదో తేదీగా క్యాలెండర్లలో ప్రకటించారు. ఆ రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటన విడుదలయ్యింది. ఎటూ ఐదో తేదీ ఆదివారం కావడంతో సెలవు ఇచ్చినా ఒకటే.. ఇవ్వకున్నా ఒక్కటే. నెల వంక కనిపించగానే, దుల్హజ్ మాసం ఆరంభమైనట్టుగా ముస్లింలు భావిస్తారు. ఆ మేరకు ఈ నెల 25న ఆకాశంలో నెల వంక కన్పించిన దాఖలాలు లేవు. దీంతో క్యాలెండర్లలో పేర్కొన్న తేదీలో మార్పు అనివార్యం అయింది. ఆ రోజున కాకుండా మరుసటి రోజున కనిపించడంతో పండుగను సోమవారం జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కనిపించని నెలవంక
ఆకాశంలో నెలవంక కన్పించని దృష్ట్యా, పండుగను ఆరో తేదీ జరుపుకునే విధంగా ప్రధాన హాజీ ప్రకటించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. ప్రభుత్వ సెలవు దినాన్ని సోమవారానికి మార్చాలని సూచించారు. దీనిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ సుంకత్ ఆరోతేదీని సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం బక్రీద్ పర్వదినంగా ప్రకటన విడుదల చేస్తూ, ఆ రోజును రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినంగా పేర్కొన్నారు. సోమవారం సెలవు దినం ప్రకటించడంతో వరుసగా ఐదు రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు విరామం లభించినట్టు అయింది. గురువారం ఆయుధ పూజ, శుక్రవారం విజయ దశమి సెలవు దినాలు కాగా, శని, ఆదివారాలు ఎలాగో సెలవు రోజులు కావడం విశేషం.
6న బక్రీద్!
Published Thu, Oct 2 2014 1:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement