ఎద్దు కంటే ఈ పొట్టేలు ధర ఎక్కువ..! | Fifty Thousand sheep Bakrid Festival | Sakshi
Sakshi News home page

ఎద్దు కంటే ఈ పొట్టేలు ధర ఎక్కువ..!

May 25 2026 1:12 PM | Updated on May 25 2026 1:32 PM

Fifty Thousand sheep Bakrid Festival

కర్నూలు:  బక్రీద్‌ పండుగ సమీపిస్తుండటంతో ముస్లింలు ఖుర్బానీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొట్టేళ్ల క్రయ, విక్రయాలు ఊపందుకున్నాయి. ఆదివారం ఎమ్మిగనూరు పొట్టేళ్ల సంత కిటకిటలాడింది. ఎమ్మిగనూరుతో పాటు కర్నూలు, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో కొనుగోలు దారులు తరలివచ్చారు. వ్యాపారులు, పొట్టేళ్ల పోషకులు పొట్టేళ్ల ధరను పెంచి విక్రయించారు. ఒక్కొక్కటి రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పైగా ధర నిర్ణయించి విక్రయానికి ఉంచారు. పండుగకు ముందు వచ్చే చివరి ఆదివారం సంతలో పొటేళ్ల క్రయ,విక్రయాలు జోరందుకున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement