ఏప్రిల్లో తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయం | Badrinath temple to reopen in April | Sakshi
Sakshi News home page

ఏప్రిల్లో తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయం

Jan 24 2015 5:51 PM | Updated on Sep 2 2017 8:12 PM

గర్వాల్ హిమాలయాల్లో ఉన్న పవిత్ర బద్రీనాథ్ ఆలయం ఐదు నెలల తర్వాత మళ్లీ ఏప్రిల్ 26న తెరుచుకోనుంది.

గర్వాల్ హిమాలయాల్లో ఉన్న పవిత్ర బద్రీనాథ్ ఆలయం ఐదు నెలల తర్వాత మళ్లీ ఏప్రిల్ 26న తెరుచుకోనుంది. శీతాకాలం, మంచు కారణంగా ఈ ఆలయాన్ని ప్రతియేటా ఐదు నెలల పాటు మూసేస్తారు. ఏప్రిల్ 26 ఉదయం 5.15 గంటలకు భక్తుల కోసం ఆలయ గేట్లు తెరుస్తారని పండిట్ ఆచార్య కృష్ణప్రసాద్ ఉనియాల్ తెలిపారు.

వసంత పంచమి సందర్భంగా పూజారులు, తేహ్రి రాజకుటుంబ సభ్యులు, డిమ్రి వర్గ ప్రతినిధులు, బద్రీనాథ్- కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్.. అంతా కలిసి ఆలయాన్ని మళ్లీ తెరిచే పవిత్ర ముహూర్తాన్ని నిర్ణయించారు. గత సంవత్సరం నవంబర్ 27న శీతాకాలం సందర్బంగా ఆలయాన్ని మూసేశారు.

Advertisement
 
Advertisement
Advertisement