ముంబైలో హీరోయిన్ శృతిహాసన్ పై దాడి | Attack on Shruti Hassan in Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో హీరోయిన్ శృతిహాసన్ పై దాడి

Nov 19 2013 8:02 PM | Updated on Sep 2 2017 12:46 AM

ముంబైలో హీరోయిన్ శృతిహాసన్ పై దాడి

ముంబైలో హీరోయిన్ శృతిహాసన్ పై దాడి

హీరోయిన్ శృతిహాసన్పై దాడి జరిగింది. ముంబైలోని ఒక అపార్ట్మెంట్లో గుర్తుతెలియని దుండగుడు ఆమెపై దాడి చేశాడు.

ముంబై:  హీరోయిన్ శృతిహాసన్పై గుర్తు తెలియని యువకుడు ఈ ఉదయం దాడి చేశాడు.   ముంబైలోని ఒక అపార్ట్మెంట్లో  ఆమెపై ఈ దాడి జరిగింది. ఒక అపార్ట్మెంట్లోని నాలుగవ అంతస్తులో ఇటీవలే ఆమె ఒక ఫ్లాట్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆమె ఒక హిందీ చిత్రంలో నటిస్తూ ఈ ఫ్లాట్లోనే ఉంటుంది. ఆమె ఇంట్లో ఉండగా గుర్తు తెలియని ఒక యువకుడు వచ్చి ఆమెపై దాడి చేశాడు. ఆ యువకుడి వయసు 25 సంవత్సరాలు ఉంటుంది. ఆ యువకుడు శృతిహాసన్ గొంతును గట్టిగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆమె అతని నుంచి తప్పించుకొని  పక్కనే ఉన్న మరో గదిలోకి వెళ్లి పోయింది. ఈ పెనుగులాటలో ఆమె చేతికి గాయమైంది.   అనుకోకుండా ఇలా ఒక్కసారిగా దాడి జరగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.  ఆ తరువాత ఆ యువకుడు పారిపోయాడు. తెలిసిన యువకుడే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.  ప్రముఖ హీరో కమల్హాసన్ కుమార్తె శృతిహాసన్ తెలుగులో గబ్బర్సింగ్, రామయ్యా వస్తావయా, బలుపు వంటి పలు చిత్రాలలో నటించింది.

Advertisement
 
Advertisement
Advertisement