ముంబైలో హీరోయిన్ శృతిహాసన్ పై దాడి
ముంబై: హీరోయిన్ శృతిహాసన్పై గుర్తు తెలియని యువకుడు ఈ ఉదయం దాడి చేశాడు. ముంబైలోని ఒక అపార్ట్మెంట్లో ఆమెపై ఈ దాడి జరిగింది. ఒక అపార్ట్మెంట్లోని నాలుగవ అంతస్తులో ఇటీవలే ఆమె ఒక ఫ్లాట్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆమె ఒక హిందీ చిత్రంలో నటిస్తూ ఈ ఫ్లాట్‌లోనే ఉంటుంది. ఆమె ఇంట్లో ఉండగా గుర్తు తెలియని ఒక యువకుడు వచ్చి ఆమెపై దాడి చేశాడు. ఆ యువకుడి వయసు 25 సంవత్సరాలు ఉంటుంది. ఆ యువకుడు శృతిహాసన్ గొంతును గట్టిగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆమె అతని నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న మరో గదిలోకి వెళ్లి పోయింది. ఈ పెనుగులాటలో ఆమె చేతికి గాయమైంది. అనుకోకుండా ఇలా ఒక్కసారిగా దాడి జరగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ తరువాత ఆ యువకుడు పారిపోయాడు. తెలిసిన యువకుడే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. ప్రముఖ హీరో కమల్‌హాసన్ కుమార్తె శృతిహాసన్ తెలుగులో గబ్బర్‌సింగ్, రామయ్యా వస్తావయా, బలుపు వంటి పలు చిత్రాలలో నటించింది.