అవినాశ్ చందర్ కు ఆర్యభట్ట అవార్డు | Aryabhata Award to avinash Chander | Sakshi
Sakshi News home page

అవినాశ్ చందర్ కు ఆర్యభట్ట అవార్డు

Feb 26 2016 4:29 AM | Updated on Sep 3 2017 6:25 PM

అవినాశ్ చందర్ కు ఆర్యభట్ట అవార్డు

అవినాశ్ చందర్ కు ఆర్యభట్ట అవార్డు

అంతరిక్ష రంగంతోపాటు వైమానిక రంగంలో చేసిన విశేష సేవలకుగాను డీఆర్‌డీవో మాజీ డెరైక్టర్ జనరల్ డాక్టర్ అవినాశ్ చందర్ ప్రతిష్టాత్మక ఆర్యభట్ట అవార్డు అందుకున్నారు.

సాక్షి, హైదరాబాద్: అంతరిక్ష రంగంతోపాటు వైమానిక రంగంలో చేసిన విశేష సేవలకుగాను డీఆర్‌డీవో మాజీ డెరైక్టర్ జనరల్ డాక్టర్ అవినాశ్ చందర్ ప్రతిష్టాత్మక ఆర్యభట్ట అవార్డు అందుకున్నారు. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో గురువారం జరిగిన ఏఎస్‌ఐ-ఇస్రో అవార్డుల కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆర్.చిదంబరం, ఇస్రో చైర్మన్ డాక్టర్ కిరణ్‌కుమార్ చేతుల మీదుగా అవినాశ్ చందర్ ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం లభిస్తాయి.

 బీహెచ్‌వీఎస్ నారాయణ మూర్తికి రాకెట్ టెక్నాలజీ అవార్డు
హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అసోసియేట్ డెరైక్టర్ బీహెచ్‌వీఎస్ నారాయణమూర్తికి రాకెట్, రాకెట్ సంబంధిత టెక్నాలజీల అభివృద్ధి అవార్డు లభించింది. రాకెట్లలోని కంప్యూటర్ల డిజైనింగ్, మిసైల్ లాంచ్ ప్రాసెస్‌ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించినందుకు గాను నారాయణమూర్తికి ఈ అవార్డు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement