శివసేన నుంచి అరవింద్‌ సావంత్‌కు బెర్త్‌

Arvind Sawant will Take Oath As Minister From Shiv Sena - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తుండగా శివసేన నుంచి అరవింద్‌ సావంత్‌ను తన క్యాబినెట్‌లోకి తీసుకుంటారని ఆ పార్టీ ప్రతనిధి సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు. ప్రధానితో పాటు 60 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా క్యాబినెట్‌లోకి అరవింద్‌ సావంత్‌ను తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి తమ పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే సూచించారని ఆయన తెలిపారు.

ప్రధాని మోదీతో పాటు సావంత్‌ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేస్తారని చెప్పారు. కాగా మోదీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పదివేల మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో అతిధులు తరలివస్తున్నారు. బిమ్స్‌టెక్‌ నేతలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల చీఫ్‌లు, వివధ రంగాల ప్రముఖులు అతిధుల జాబితాలో ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top