మోదీ సర్కార్‌పై మండిపడ్డ నటి

Article 370 carried out in inhuman way Said By  Urmila Matondkar - Sakshi

ముంబై: మోదీ సర్కార్‌ ఆర్టికల్‌ 370ను రద్దు చేయడంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నటి, కాంగ్రెస్‌ నాయకురాలు ఊర్మిలా మాటోండ్కర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కశ్మీర్‌ ప్రజలు ఎన్ని రోజులు భద్రతా బలగాల నీడలో నివసించాలని ఆమె ప్రశ్నించారు.

ఏదయినా సంచలన నిర్ణయం తీసుకునే ముందు ప్రజలు ఎదుర్కోబోయే సమస్యల గురించి ఆలోచిస్తే బాగుండేదన్నారు. తన భర్త వారి తల్లిదండ్రులతో మాట్లాడి 22రోజులయిందని ఆమె వాపోయారు. తన అత్తమామలిద్దరు చక్కెర వ్యాధి, హైబీపీతో బాధపడుతున్నట్లు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఇంట్లో మందులు సైతం అందుబాటులో ఉన్నాయో లేదో తెలియదని ఆమె మదనపడ్డారు. గత ఎన్నికలలో ఊర్మిళ కాంగ్రెస్‌ తరుపున ముంబై నుంచి పోటీ చేసిన విషయం విదితమే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top