మోడీకి వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం
భారత ప్రధాని నరేంద్ర మోడీ ని తీవ్రంగా దుయ్యబట్టుతూ పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు
భారత ప్రధాని నరేంద్ర మోడీ ని తీవ్రంగా దుయ్యబట్టుతూ పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని నరేంద్ర మోడీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో వ్యాఖ్యానించడాన్ని తప్పు పట్టుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నవాజ్ షరీఫ్ పంజాబ్ కి చెందిన వారే. ఆయన సోదరుడే ఆ రాష్ట్ర్ర ప్రభుత్వానికి అధినేత. పైగా పాకిస్తాన్ లోకి బెలూచిస్తాన్ లో ఉగ్రవాదాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని కూడా తీర్మానంలో పేర్కొన్నారు.
అయితే అధికార పార్టీ మాత్రం ఈ తీర్మానాన్ని తోసిపుచ్చింది. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం నరేంద్ర మోడీతో జరిగిన చర్చలు ఆశించిన దానికన్నా సఫలమయ్యాయని ప్రకటించింది.