రశ్మికు అమృత ఫడ్నవిస్‌ అభినందనలు.. | Amruta Fadnavis Congratulates To Rashmi Thackeray | Sakshi
Sakshi News home page

రశ్మికు అమృత ఫడ్నవిస్‌ అభినందనలు..

Mar 1 2020 9:58 PM | Updated on Mar 1 2020 10:11 PM

Amruta Fadnavis Congratulates To Rashmi Thackeray - Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సతీమణి రశ్మి ఠాక్రే శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సతీమణి అమృత ఫడ్నవిస్‌ స్పందించారు. సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు స్పీకరించినందుకు రశ్మికి అభినందనలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళ ప్రాతినిథ్యం పెరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలు ముఖ్య స్థానాల్లో ఉంటేనే వారి అభిప్రాయాలను స్పష్టంగా బయటపెట్టగలరని పేర్కొన్నారు. ఈ మేరకు అమృత తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. (సామ్నా ఎడిటర్‌గా రశ్మి ఠాక్రే)

కాగా ఆదివారం వెలువడిన సామ్నా పేపర్‌లో రశ్మిని ఎడిటర్‌గా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ రశ్మినే కావడం విశేషం.  మరోవైపు  శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ యథావిథిగా సామ్నా కార్యనిర్వహక ఎడిటర్‌గా కొనసాగనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement