అమృత్‌సర్‌ ప్రమాదం : సెల్ఫీల గోలలో పడి | Amritsar Train Accident People Seen Clicking Selfies When Train Ran | Sakshi
Sakshi News home page

అమృత్‌సర్‌ ప్రమాదం : సెల్ఫీల గోలలో పడి

Oct 20 2018 1:28 PM | Updated on Oct 20 2018 2:08 PM

Amritsar Train Accident People Seen Clicking Selfies When Train Ran - Sakshi

అమృత్‌సర్‌ : సెల్ఫీల పిచ్చి ఎలాంటి ప్రమాదాలు తీసుకోస్తుందో చూస్తునే ఉన్నాం. సెల్ఫీ మోజులో పడి ప్రాణాలతో చెలగాటమడుతున్నారు జనాలు. తాజాగా రెండు రోజుల క్రితం పంజాబ్‌లో జరిగిన రైలు ప్రమాదం దాదాపు 60 మందిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరగాడానికి ముఖ్య కారణం ఒకటి.. రైల్వే ట్రాక్ పక్కన వేడుకలు నిర్వహించడమయితే.. రెండు.. వేడుక చూడ్డానికి వచ్చిన జనాలు వీడియోలు తీస్తూ.. సెల్ఫీలు దిగుతూ పరిసరాలను పట్టించుకోలేదు అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు.

ఒక వైపు బాణాసంచా హడావుడి.. మరో వైపు ఫోన్‌లో బిజీగా ఉన్న జనాలు తాము ఉన్న పరిసారలను మర్చిపోయారు. ఇంతలో రైల్వే ట్రాక్‌పై నిల్చుని రావణ దహన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలపైకి రైలు మృత్యువులా దూసుకొచ్చింది. అదే సమయంలో మరో ట్రాక్‌పైకి ఇంకో రైలు రావడంతో అక్కడివారికి తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశం లభించలేదు. దాంతో పండుగ నాడే వారంతా మృత్యు కౌగిలోలికి చేరారు. ఈ ఘటనలో దాదాపు 61 మంది మృత్యువాత పడగా, మరో 72 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement