‘కశ్మీర్‌ విముక్తి కోసం మూడు తరాల పోరాటం’

Amith Shah Slams Jawaharlal Nehru In Mumbai - Sakshi

నెహ్రూ నిర్ణయం వల్లనే ‍కశ్మీర్‌ సమస్య

ముంబై ఎన్నికల ప్రచారంలో అమిత్‌ షా

ముంబై: దేశ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 1947లో కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయకుండా నెహ్రూ చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. నెహ్రూ నిర్ణయం వల్లనే కశ్మీర్‌లో ఉగ్రవాదం పెచ్చుమీరిపోయిందని ఆరోపించాడు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమిత్‌ షా ఆదివారం ముంబైలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌ అంశం మాజీ హోంమంత్రి సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌కు అప్పగించినట్లయితే ఎప్పుడో భారత్‌లో విలీనమయ్యేదని అభిప్రాయడ్డాడు.

‘కశ్మీర్‌లో ఉగ్రమూకలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాం. దేశం గర్వపడే అంశాన్ని కాంగ్రెస్‌ రాజకీయం చేయడం వారి అపరిపక్వతకు నిదర్శం. బీజేపీ ఈ అంశాన్ని జాతీయవాద విజయంగా పరిగణిస్తుంది. కశ్మీర్‌ అంశంపై పాకిస్తాన్‌ అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దును రాజకీయ సమస్యగా రాహుల్ గాంధీ చిత్రీకరిస్తున్నారు. రాహుల్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారు, కానీ కశ్మీర్‌ విముక్తి కోసం  బీజేపీ మూడు తరాల నాయకులు పోరాడుతున్నారు. బీజేపీ ప్రధాన ఎజెండా దేశాన్ని ఐక్యంగా ఉంచడమే. ఒకే దేశం, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగం అనే సిద్ధాంతానికి బీజేపీ కట్టుబడి ఉంది’ అని  అమిత్‌ షా పేర్కొన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top