ఇలాంటి అద్భుతాలు కొందరికే సాధ్యం

Amazing Video Of Man Spins Glasses Of Water Without Spilling A Drop - Sakshi

కొన్ని అద్భుతాలు కొందరికే సాధ్యమవుతాయని ఈ వీడియో చూస్తే కచ్చితంగా చెప్పేస్తారు. ఎందుకంటే సాధారణంగా గ్లాసులో నీళ్లు నింపి దానితో ఏదైనా ప్రయోగం చేయాలని చూసేలోపే నీళ్లన్ని నేలపాలవ్వడం ఖాయం. కానీ ఒక వ్యక్తి మాత్రం రెండు గ్లాసుల్లో నీరు నింపి దానికి తాడు కట్టి ఇష్టం వచ్చినట్లుగా తిప్పినా ఒక్క చుక్క నీరు కూడా కింద పడకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థ 'ఫిజిక్స్‌ అండ్‌ ఆస్ట్రానమిజోన్‌' తమ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ' ఈ వీడియో  భౌతిక శాస్త్రం గొప్పతనాన్ని చూపిస్తోంది.' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. (వైరల్‌ వీడియో: ఆ పక్షి పేరేంటో చెప్పండి!)

ఇక వీడియో విషయానికి వస్తే మొదట రెండు గ్లాసుల్లో నీళ్లు పోసి వాటికి సమాంతరంగా రెండు తాళ్లను కట్టి పెండ్యులమ్‌(లోలకం) ఆకారంలో తిప్పడం ప్రారంభించాడు. తరువాత ఒక్కసారిగా స్పీడ్‌ పెంచి తల వెనుక భాగం నుంచి సర్కిల్‌ ఆకారంలో తిప్పడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఒక్క చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. ఆ తరువాత గ్లాసులోని నీళ్లను గటగట తాగేసి షో సమాప్తం అన్నట్లుగా సూచించాడు. అయితే ఆ వ్యక్తి చేసింది మ్యాజిక్‌ కాదని, భౌతికశాస్త్రంలోని న్యూటన్‌ ఫస్ట్‌ లా( లా ఆఫ్‌ ఇనర్షియా) జడత్వం, సెంట్రీపిటల్‌ ఫోర్స్‌ను ఆధారంగా చేసుకొని  ఇలా చేశాడంటూ ఫిజిక్స్‌ అండ్‌ ఆస్ట్రానమి పేర్కొంది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.7 మిలియన్‌ మంది వీక్షించారు. ఈ వీడియో ఎక్కడ తీశారనేదానిపై స్పష్టత లేదు కాని.. వీడియోలోని వ్యక్తి మాత్రం చెన్నైలోని కన్నాజీనగర్‌కు చెందిన వాడని ఒక నెటిజన్‌ పేర్కొన్నాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top