
న్యూఢిల్లీ : సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మరణించిన రోజున అతనితో ఉన్న నలుగురు న్యాయమూర్తులు.. అది సహజ మరణమేనని చెప్పారని, వారి వాంగ్మూలాల్ని సందేహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. లోయా కేసులో మహారాష్ట్ర తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. ‘లోయాది సహజ మరణమేనంటూ నలుగురు జడ్జీలు(కులకర్ణి, బార్దే, మోదక్, ఆర్‌ఆర్ రతి) ఇచ్చిన వాంగ్మూలాలు నమ్మదగినవి. 2014 నవంబర్ 29 – డిసెంబర్ 1 మధ్య వారు లోయాతోనే ఉన్నారు. వాంగ్మూలాలపై ఆ నలుగురి సంతకాలు ఉన్నాయి. అలాంటప్పుడు అవి నమ్మదగినవి కావా?’ అని రోహత్గీ ప్రశ్నించారు. ఒకవేళ ఆ వాంగ్మూలాల్ని మీరు(కోర్టు) తిరస్కరించాలనుకుంటే.. వారిని సహకుట్రదారులుగా ప్రాథమికంగా అంగీకరిస్తున్నట్లేనని అన్నారు.