ఆ కాలేజీలను మూసివేస్తాం: ఏఐసీటీఈ | AICTE to close engineering colleges with less takers | Sakshi
Sakshi News home page

ఆ కాలేజీలను మూసివేస్తాం: ఏఐసీటీఈ

Aug 12 2017 1:15 AM | Updated on Sep 11 2017 11:50 PM

దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో భారీ సంఖ్యలో మిగిలిపోతున్న సీట్లపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దృష్టి సారించింది.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో భారీ సంఖ్యలో మిగిలిపోతున్న సీట్లపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దృష్టి సారించింది. గత ఐదేళ్ల కాలంలో 30 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు నమోదైన ఇంజనీరింగ్‌ కాలేజీలను వచ్చే ఏడాది నుంచి మూసివేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది.

ఈ మేరకు ఇక్కడ జరుగుతున్న రెండు రోజుల వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో ఏఐసీటీఈ చైర్మన్‌ అనిల్‌ డీ సహస్రబుద్ధే తెలిపారు. దేశంలోని 10,361 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 37 లక్షలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయ, ఏటా 27 లక్షల సీట్లు విద్యార్థులు లేక ఖాళీగా మిగిలిపోతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో వాటి సంఖ్యను పెంచేందుకు గాను ‘నేషనల్‌ స్టూడెంట్‌ స్టార్టప్‌ పాలసీ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement