'స్టీల్ ప్లాంట్‌పై ప్రకటన చేయండి' | Advertise on steel plant | Sakshi
Sakshi News home page

'స్టీల్ ప్లాంట్‌పై ప్రకటన చేయండి'

Jul 21 2016 2:39 AM | Updated on Aug 20 2018 9:16 PM

'స్టీల్ ప్లాంట్‌పై ప్రకటన చేయండి' - Sakshi

'స్టీల్ ప్లాంట్‌పై ప్రకటన చేయండి'

వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటుపై తక్షణమే ఒక ప్రకటన చేయాలని వైఎస్ అవినాశ్‌రెడ్డి కోరారు.

కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌కు ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వినతి

 సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై తక్షణమే ఒక ప్రకటన చేయాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌కు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. ఒక వినతిపత్రం అందజేశారు.

ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలియజేశారు.మంత్రి బీరేంద్రసింగ్ స్పందిస్తూ... 10 రోజుల్లో టాస్క్‌ఫోర్స్ సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. టాస్క్‌ఫోర్స్ సమావేశం అనంతరం మరోసారి కలుద్దామని మంత్రి సూచించినట్టు అవినాశ్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement