breaking news
Birendrasing
-
సర్దార్ సింగ్‌కు పిలుపు
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ తిరిగి భారత హాకీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మిడ్ ఫీల్డ్‌ను బలోపేతం చేయడంలో భాగంగా అతనితో పాటు బీరేంద్ర లక్డాలను ఎంపిక చేశారు. ఈ నెల 23 నుంచి నెదర్లాండ్స్‌లో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం గురువారం జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యుల జట్టుకు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నిరాశజనక ప్రదర్శన కనబరచడంతో జట్టులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కామన్వెల్త్ జట్టులో చోటు దక్కని సర్దార్ సింగ్, లాక్రాలను తిరిగి ఎంపిక చేశారు. జట్టు: గోల్‌కీపర్స్: శ్రీజేశ్ (కెప్టెన్), బహదూర్ పాఠక్. డిఫెండర్స్: హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, సురేందర్, జర్మన్‌ప్రీత్ సింగ్, బీరేంద్ర లక్డా, అమిత్ రొహిదాస్. మిడ్ఫీల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్, చింగ్లెన్సన సింగ్, సర్దార్ సింగ్, వివేక్ సాగర్. ఫార్వర్డ్స్: సునీల్ విఠలాచార్య, రమణ్‌దీప్ సింగ్, మన్దీప్ సింగ్, సుమిత్ కుమార్, ఆకాశ్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్. -
'స్టీల్ ప్లాంట్‌పై ప్రకటన చేయండి'
కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌కు ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వినతి సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై తక్షణమే ఒక ప్రకటన చేయాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌కు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. ఒక వినతిపత్రం అందజేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలియజేశారు.మంత్రి బీరేంద్రసింగ్ స్పందిస్తూ... 10 రోజుల్లో టాస్క్‌ఫోర్స్ సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. టాస్క్‌ఫోర్స్ సమావేశం అనంతరం మరోసారి కలుద్దామని మంత్రి సూచించినట్టు అవినాశ్‌రెడ్డి తెలిపారు.