తౌసీఫ్‌ మాటవిని తిరిగొచ్చాడు.. కానీ ఆదిల్‌..

Adil Ahmed Dar Relative To Interrogate By NIA - Sakshi

ఆదిల్‌ అహ్మద్‌ బంధువులను విచారించనున్న ఎన్‌ఐఏ..!

న్యూఢిల్లీ : పుల్వామాలో ఆత్మాహుతి దాడి చేసి 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను బలిగొన్న ఆదిల్‌ అహ్మద్‌దార్‌ కుటుంబ సభ్యులను ఎన్‌ఐఏ విచారిస్తోంది. ఆదిల్‌ సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ లింకులతో పాటు, అతని కుటుంబ సభ్యుల డీఎన్‌ఏలు సేకరించింది. ఆదిల్‌తో పాటు అతని బంధువు తౌసీఫ్‌ కూడా జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థలో చేరినట్టు తెలిసింది. అయితే, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు తౌసీఫ్‌ ఇంటికి తిరిగొచ్చినా.. ఆదిల్‌ మాత్రం రాలేదని అతని తల్లిదండ్రులు తెలిపారు. (దీటుగా బదులిస్తాం: పాక్‌ హెచ్చరిక)

కాగా, తౌసీఫ్‌ ప్రస్తుతం జమ్మూ జైలులో ఉన్నాడు. అతన్ని ఎన్‌ఐఏ విచారించనుందని సమాచారం. పుల్వామా ప్రాంతంలోని స్థానికులు, అక్కడి జవాన్ల స్టేట్‌మెంట్లను ఎన్‌ఐఏ రికార్డు చేసింది. పుల్వామా ఉగ్రకుట్రకు అంత భారీ మొత్తంలో ఆర్డీఎక్స్‌ ఎలా లభ్యమైందనే కోణంలో విచారణ కొనసాగుతోంది. జైషేకు బయటనుంచి మద్దతిచ్చే వారు డిసెంబర్‌లో 100 కేజీ ఆర్డీఎక్స్‌ను తరలిస్తుండగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజన్సీ  స్వాధీనం చేసుకుంది. పుల్వామాలో అంత భారీ స్థాయిలో ఆర్డీఎక్స్‌తో విధ్వంసం సృష్టించడానికి చిన్న చిన్న మొత్తాల్లో కొన్ని నెలలపాటు ఆర్డీఎక్స్‌ను పోగుచేశారని అధికారులు గుర్తించారు.

(మోదీ ఆ రోజు తిన్నారా, తినలేదా !?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top