ఢిల్లీ: భారత్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, అన్మోల్ బిష్ణోయ్‌కు పటియాలో కోర్టు 11 రోజుల ఎన్‌ఐఏ కస్టడీ విధించింది.
18కిపైగా కేసుల్లో నిందితుడుగా ఉన్న అన్మోల్ బిష్ణోయ్‌ను విచారించేందుకు తమను అప్పగించాలని భారత్ సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ప్రత్యేక విమానంలో అన్మోల్ బిష్ణోయ్‌ను భారత్‌కు పంపించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అన్మోల్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ పటియాల కోర్టు ఎదుట హాజరు పరిచింది.
పలు కీలక కేసుల్లో నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్ణోయ్‌ను విచారించేందుకు 15రోజుల కస్టడీ కోరింది. అయితే, కోర్టు మాత్రం ఎన్‌ఐఏకు 11 రోజుల గడువు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో ఎన్‌ఐఏ అన్మోల్ బిష్ణోయ్‌ను దర్యాప్తు చేపట్టనుంది.


